Site icon TeluguMirchi.com

‘ఖైదీ నెంబర్ 150’ లో ఎంతమంది రచయితలో తెలుసా..?

chiruమెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150, తమిళ రీమేక్ చిత్రమని తెలుసు..కాకపోతే ఇది తమిళ చిత్ర రీమేక్ అనే ఛాయలు కనిపించుకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటూ తెలుగు నేటివిటీ కి ఈ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్టర్ వినాయక్ తెరకెక్కిస్తున్నాడు..ఇక ఈ సినిమాలో మొత్తం నలుగురు రచయితలు వర్క్ చేశారట..అంతమంది ఎందుకో అనుకుంటున్నారా…ఫుల్ స్టోరీ మీరే చూసెయ్యండి.

ముందుగా ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దించగా , ఆ తరువాత రైటర్ ఆకుల శివ కొంత భాగానికి మాటలు రాయడం జరిగిందట. సినిమాలో ముఖ్యమైన ఎమోషన్ సన్నివేశాలు రాయడానికి కంచె ఫేమ్ సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారట. తాజాగా దర్శకుడు కామ్ రైటర్ అయినా సుకుమార్ వద్ధ శిష్యరికం చేసిన హుస్సేన్ షా కిరణ్ కు కామెడీ పోర్షన్ రాసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి, సునీల్, అలీ, బ్రహ్మానందం వీళ్ళ మధ్య వచ్చే కామెడీ పోర్షన్ ను హుస్సేన్ తో రాయించారట. ఇవే మూవీ కి మరో హైలైట్ కాబోతున్నాయని చిత్ర వర్గం చెపుతుంది. మొత్తానికి చిరంజీవి కోసం నలుగురు దిగ్గజాలు దిగారన్నమాట.

Exit mobile version