‘ఖైదీ నెం 150’ టైటిల్ మార్చబోతున్నారా..?

chiru-150th-film-distbutersమెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఖైదీ నెం 150’ అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ ను మార్చబోతున్నట్లు ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. తమిళ కత్తి చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి ముందుగా ‘కత్తిలాంటోడు’ అనుకున్నారు. అయితే ఆ టైటిల్ అంత క్యాచీగా లేకపోవడంతో టైటిల్ అది కాదని రకరకాల పేర్లు పరిశీలించి చివరకు ‘ఖైదీ నెం 150’ అని ఫిక్స్ అయ్యారు.

కాకపోతే ఈ టైటిల్ కూడా అంత బాగాలేదని మెగా ఫ్యామిలీ భావిస్తున్నారట..ఈ టైటిల్ కు అభిమానుల నుంచి గానీ, చిరు శ్రేయోభిలాషుల నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాకపోగా టైటిల్ చాలా పాతగా, దమ్ము లేనట్లుగా ఉందని భావిస్తున్నారట. చిరంజీవి చాల గ్యాప్ తర్వాత రీఎంట్రీ సినిమా , కావడం అలాగే 150 వ చిత్రం కావడం తో టైటిల్ ఇంకా పవర్ ఫుల్ గా ఉంటె బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. చిరంజీవి , కాజల్ ఫై చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. 2017 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.