Site icon TeluguMirchi.com

హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్స్..

kabali-tickets2

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెం 150’ మొదటి రోజు మొదటి షో చూడాలని అభిమానులే కాదు సినీ ప్రేక్షకుడు ఆఖరికి సినీ నటి , నటులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు..ఈ నెల 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణం లో హైదరాబాద్ ఐమాక్స్ లో ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసారు..జస్ట్ ఓపెన్ చేసిన అరగంటలోనే దాదాపు 30 షోల టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి..

ఈ ఒక్క ఉదాహరణ చాలు బాస్ ఈజ్ బ్యాక్ ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందో..దాదాపు ఐమాక్స్ స్క్రీన్లు అన్నీ మొదటి రోజు ఈ సినిమాకే కేటాయించేసారు. దీంతో మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు సుమారు 30 షోస్ పడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అవన్నీ ఫుల్ అయిపోయాయి. దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు రికార్డ్స్ బ్రేక్ చేయాలనీ మెగా క్యాంపు ఏ విధంగా అయితే అనుకుందో అది ఈజీ గా బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది.

మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి దాటిన తరువాత షోలు ప్రదర్శించేందుకు ఎక్కడికక్కడ లోకల్ గా అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెల్లవారి ఆరు గంటల నుంచే షోలు ప్రారంభమవుతాయని తెలుస్తుంది. తొలి రోజు ప్రతి థియేటర్ లో కనీసం ఆరు షోలు వుండే అవకాశం వుందని సమాచారం..

Exit mobile version