Site icon TeluguMirchi.com

రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఖైదీ ట్రైలర్

khaidi-trailer-youtubeచిరంజీవి నటించిన 150 వ చిత్రం ఖైదీ నెం 150 అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయ్యింది..ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అభిమానుల కోలాహలల మధ్య గ్రాండ్ జరిగింది..ఇప్పటివరకు పోస్టర్స్ తో అలరిస్తూ వస్తున్న చిరు , నిన్న ఫంక్షన్ లో ఖైదీ నంబర్ 150 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులకు సినిమాకు ముందే ఫుల్ భోజనం పెట్టేసాడు..

ట్రైలర్ విడుదల క్షణం నుండి యూట్యూబ్ లో అదరగొడుతుంది..కేవలం 4 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ సాధించి , సినిమా ఫై ఎలాంటి క్రేజ్ ఉందో నిరూపించింది.. ఇప్పటివరకు 2,223,962వ్యూస్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది..ట్రైలర్ విషయానికి వస్తే ..ఈ ట్రైలర్ లో ”పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది’ అని మెగాస్టార్‌ చెబుతుంటే.. బాక్సాఫీసు బద్దలు కొట్టడానికి మెగా స్టార్ ఇచ్చిన వార్నింగ్ లా అనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ లో మెగా మార్క్ ఉండేలా వినాయక్ కష్టపడ్డాడు. ‘కష్టం వస్తదో.. కార్పొరేట్‌ సిస్టమ్‌ వస్తదో రమ్మను’.. ‘వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి’.. అంటూ మెగాస్టార్ డైలాగులు అభిమానులకే కాక సినీ ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చాయి..

Exit mobile version