మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రం టాలీవుడ్ టాప్ చిత్రాల్లో రెండవ స్థానంలో నిలిచింది. సునాయాసంగా వంద కోట్ల వసూళ్లను సాధించిన ఖైదీ నెం.150 చిత్రంతో చిరంజీవి స్టామినా ఏంటో తేలిపోయింది. విశ్లేషకు సినిమాను ఒక సాదారణ ఎంటర్టైనర్గా ఖైదీ ఉందని అన్నా కూడా ప్రేక్షకు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంతో చిరంజీవి క్రేజ్ మరింత పెరిగింది, నిర్మాత రామ్ చరణ్‌కు వంద కోట్లకు పైగా లాభాు వచ్చాయి. అయితే దర్శకుడు వివి వినాయక్ మరియు హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మాత్రం పెద్దగా యూజ్ లేకుండా పోయింది.
మామూుగా అయితే వంద కోట్ల చిత్రాన్ని చేసిన దర్శకుడితో సినిమా చేయాని స్టార్ హీరో నుండి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాని వినాయక్‌తో సినిమా చేసేందుకు ఏ స్టార్ హీరో ఆసక్తి చూపించలేదు. స్వయంగా వినాయక్ అడిగినా ఇద్దరు ముగ్గురు హీరోు ప్రస్తుతానికి డేట్లు లేవంటూ తప్పించుకున్నారట. అందుకే ఇప్పటి వరకు వినాయక్ తన తర్వాత సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ కాజల్ పరిస్థితి కూడా అంతే ఉంది. ‘ఖైదీ నెం.150’ చిత్రంలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న కాజల్‌కు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అవకాశం రాలేదు. ఖైదీ క్రెడిట్ మొత్తం చిరంజీవికే పోయింది, లాభం మొత్తం చరణ్‌కే దక్కిందని దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా..!