‘ఖైదీ నంబరు 150’ అధికారిక రిలీజ్ డేట్..

Khaidi-No150-First-Look-Mot
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబరు 150’ చిత్రం అధికారిక రిలీజ్ డేట్ ను ప్రకటన చేసారు చిత్ర యూనిట్. 2017 సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

తమిళ కత్తి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం , ఇప్పటికి 70 శాతం పైగా చిత్రీకరణ పూర్తియిందని, చిరంజీవి డబ్బింగ్‌ కూడా మొదలు పెట్టాడని చరణ్ తెలిపాడు. ప్రస్తుతం సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని , అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబరు 150’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ సోషల్ మీడియా ద్వారా చరణ్ తెలియజేసాడు. చిరు కు జోడిగా కాజల్ జతకట్టగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు తరుణ్‌ అరోరా విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.