Site icon TeluguMirchi.com

గుడ్ న్యూస్ : అర్ధరాత్రి నుండే మెగా సందడి మొదలుకానుంది..

Fans-Hungama-Khaidi2

గత 9 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి ని వెండి తెర ఫై చూడాలని అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ కల మరికొద్ది గంటల్లో తీరబోతుంది. ఖైదీ నెం 150 తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిపోయాయి..ఓపెన్ అయిన ఆరగంటలోపే హౌస్ ఫుల్ కావడం మూవీ ఫై ఉన్న క్రేజ్ ను బయటపెడుతోంది..

మొదటినుండి ఖైదీ ప్రీమియర్ షోస్ లేవని చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్ , తాజాగా సినిమా ఫై అంచనాలు భారీ స్థాయికి పెరగడం తో ఓ అడుగు కిందకు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోస్ వేయాలనే ఆలోచనలో ఉన్నారట..ఒకవేళ అర్ధరాత్రి కాకపోయినా తెల్లవారు జామున 3 , 4 గంటల సమాయనైనా షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారట..ఆ మేరకు థియేటర్స్ యాజమాన్యం తో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. మరోపక్క థియేటర్స్ అన్ని కూడా ఖైదీ కే కేటాయించారు. హైదరాబాద్ లో దాదాపు 90 % థియేటర్స్ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నాయి. ప్రసాద్ ఐమాక్స్ లో మొదటిరోజు దాదాపు 30 షోస్ వేయబోతున్నారు.

Exit mobile version