కెజిఎఫ్‌ డైరెక్టర్ తో యంగ్ టైగర్..?

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. రెండోవ చిత్రంతోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రశాంత్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎవరు హీరో అనేది నిన్నటి వరకు సస్పెన్స్ గా సాగింది. ఇక ఇప్పుడు ఆ సస్పన్స్ కు తెర పడినట్లే అని తెలుస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కోసం ఓ పవర్ ఫుల్ కథ ను సిద్ధం చేసి ఉంచాడట ప్రశాంత్. ఇప్పటికే ఎన్టీఆర్ కు ఆ కథ వినిపించడం..ఆయన దగ్గరి నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం కూడా జరిగిపోయినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. 2020 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ తో చేస్తాడా..లేక అంతకంటే ముందే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది .