‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ అంటూ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. రెండు నెలల క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది సినిమా వస్తుందని, ఇప్పుడు దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ 2 నుండి ఒక బిగ్ న్యూస్ రాబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రేపు అంటే జులై 26వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ న్యూస్ ఏంటో తెలియబోతుంది. కేజీఎఫ్ 2 షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి మరే అప్‌డేట్ లేదు. ఇప్పుడు ఆ అప్‌డేట్ రాబోతుంది. ఆ బిగ్ న్యూస్ ఏమై ఉంటుందా అంటూ సౌత్ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.