Site icon TeluguMirchi.com

బ్యాకాంక్ లో ‘కెవ్వు-కేక’

JAG_4182‘బ్లేడ్ బాబ్జీ’ చిత్రం తరవాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘కెవ్వు కేక’. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్  పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను వివరిస్తూ… ‘సక్సెస్ ఫూల్ కాంబినేషన్ లో రూపొందుతున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. నరేష్ పాత్ర చిత్రానికి హైలైట్ గా ఉంటుంది. హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తికాగానే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 24 వరకు బ్యాంకాక్ లోని పలు సుందరమైన ప్రదేశాల్లో మేజర్ షెడ్యూల్ ని పూర్తిచేస్తాం అని తెలిపారు. నరేష్, ధర్మవరపు సుబ్రహ్మాణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం : చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్ : నందమూరి హరి, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం- : దేవి ప్రసాద్, సమర్పణ : నీలిమ

Exit mobile version