ఉలవచారు బిర్యాని’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘కేటుగాడు’. కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటేష్ బాలసాని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఆడియో మంచి సక్సెస్ సాధించింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకుంది. ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత నేను హీరోగా ఇక్కడ నిలబడటానికి కారణమైన కె.యస్.రామారావుగారు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరూ ఈ సినిమాని చూసి, చాలా బావుందని, చాలా బాగా నటించానని మెచ్చుకోవడం చాలా హ్యపీగా అనిపించింది. అంతే కాకుండా సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సాయికార్తీక్ గారు అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. ఆడియో పెద్ద హిట్టయింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందింది. వెంకటేష్ గారి లాంటి నిర్మాత వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఉలవచారు బిర్యాని తర్వాతే నేను హీరోగా చేసిన ఈ సినిమా విడుదలవుతుంటే చాలా ఎగ్జయిట్ గా ఉంది. సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని హీరో తేజస్ అన్నారు. సాయికార్తీక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి పాటను డిఫరెంట్‌గా ఇచ్చారు. జోషిగారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. ఒక మంచి సినిమాని రూపొందించాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. సినిమా సెన్సార్ కూడా పూర్తయిపోయింది. వచ్చే నెలలో సినిమాని మీ ముందుకు తీసుకువస్తాం. సినిమాని పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నామని నిర్మాత వెంకటేష్ బలసాని అన్నారు. నన్ను సాయికార్తీక్ గారు సినిమాని తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరో లెవల్ లో నిలబెట్టారు. తేజస్, చాందని సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమాని విడుదలకు సిద్ధం చేశాం. తేజస్ కి ఈ చిత్రంలో మాస్ హీరో ఇమేజ్ వస్తుంది. త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు కిట్టు నల్లూరి అన్నారు.
మంచి కథ, యూత్ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. దర్శకుడు కిట్టు, నిర్మాత వెంకటేష్ బలసాని ఒక మంచి క్వాలిటీ మూవీని అందిస్తే, హీరో తేజస్ పది, పదిహేను సినిమాల అనుభమున్న హీరోలా నటించాడు. సినిమా బాగా వచ్చింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చిత్ర సమర్పకులు వి.ఎస్.పి.తెన్నేటి
అజయ్, సుమన్, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, సప్తగిరి, సోఫియా, రఘు కారుమంచి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, సాహిత్యం: భాషా శ్రీ, బాలాజీ, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సుబ్బరాయ శర్మ, యాక్షన్: నందు, డ్యాన్స్: సాయిరాజ్, ఎడిటర్: పశుమ్ వి.రావ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచ్చిబాబు.యం., సంపత్‌కుమార్, నిర్మాత: వెంకటేష్ బసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి