తాజాగా ఆ విషయమై స్పందించిన కేథరిన్ తెర్సా తనకు అస్సలు సిగరెట్లు అలవాటు లేదు అని, కాకుంటే సినిమాలో పాత్ర కోసం తప్పలేదు అని చెప్పుకొచ్చింది. చిత్రంలో పాత్ర కోసం దర్శకుడు తేజ గారు సిగరెట్లు తాగాలని చెప్పినప్పుడు కంగారు పడ్డాను. షూటింగ్ సమయం వచ్చే వరకు నేర్చుకుందాం అని ఫిక్స్ అయ్యాను. అయితే సినిమా షూటింగ్ వచ్చే వరకు సిగరెట్లు ముట్టుకోలేదు. షూటింగ్ స్పాట్‌లో సిగరెట్ వెలిగించి ఇచ్చారు.
అప్పుడు నా వల్ల కాదు అంటూ దర్శకుడు తేజాను వేడుకోవడం జరిగింది. కాని ఆయన మాత్రం బలవంతంగా నాతో సిగరెట్ తాగిపించారు. సిగరెట్ తాగడం వల్లే ఇప్పుడు ఆ పాత్ర ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన చెబుతున్నాడు. కాని మళ్లీ ఎప్పుడు కూడా సిగరెట్లు తాగను. మరే సినిమాలో కూడా సిగరెట్లు తాగుతూ నటించను అంటూ ప్రకటన చేసింది.