రానాని తిరస్కరించిన కీర్తి సురేష్‌

ముద్దుగుమ్మ కీర్తి శిరీష్‌ ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఆ తర్వాత ‘నేను లోకల్‌’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుని ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా గొప్ప నటిగా పేరును సొంతం చేసుకుంది.  సీనియర్‌ హీరోయిన్‌ సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం పలు రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడికి చెప్పుకొదగ్గ క్రేజీ ఆఫర్లేవి చేతిలో లేవు. ‘మహానటి’ తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందని భావించినా కీర్తికి అంతా రివర్స్‌ అయింది. ఒక్క మంచి ప్రాజెక్ట్‌ కూడా లేకపోవడంతో కీర్తి అభిఆనులు చాలా నిరాశగా ఉన్నారు.

దగ్గుబాటి రానా తాజాగా కొరియన్‌ చిత్రంకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకుంది. మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నందని రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి బావుంటుందని భావించిన చిత్ర యూనిట్‌ సంప్రదిస్తే కీర్తి నో చెప్పినట్లుగా సమాచారం. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌లేవి లేకున్నా కూడా రానా ఆఫర్‌ని తిరస్కరించింది.