Site icon TeluguMirchi.com

‘మిస్‌ ఇండియా’గా మహానటి?

తెలుగు ప్రేక్షకులను ‘మహానటి’ చిత్రంతో కట్టి పడేసిన కీర్తి సురేష్‌ ప్రస్తుతం నరేంద్ర దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో చాలా గ్యాప్‌ తీసుకుని కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను దర్శక నిర్మాతలు చాలా విభిన్నంగా సినిమాను తెరకెక్కించారట. లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంకు తాజాగా టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు.

మహేష్‌ కోనేరు తాజాగా ‘మిస్‌ ఇండియా’ అనే టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించాడట. ఆ టైటిల్‌ ఖచ్చితంగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సినిమాకే అయ్యి ఉంటుందని అంటున్నారు. మోడలింగ్‌ మరియు ఒక సామాజిక అంశం గురించి సినిమా తెరకెక్కుతుంది. తెలుగు మరియు తమిళంలో ఒకే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌తో కీర్తి సురేష్‌ చేస్తున్న ఈ చిత్రం ఇదే ఏడాది చివరి వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంకు సంబంధించిన ఎలాంటి పోస్టర్స్‌ ఇంకా బయటకు రాలేదు.

Exit mobile version