Site icon TeluguMirchi.com

గుర్తుపట్టలేనంతగా మారిందిగా..

ఏ హీరోయిన్ అయినా సరే నార్త్ ఆఫర్ వస్తే చాలు వారి ఫిజిక్ మీద ఇంకాస్త దృష్టి పెడతారు..అప్పటి వరకు కాస్త లావుగా ఉన్న కానీ..బాలీవుడ్ ఛాన్స్ రాగానే జీరో సైజు ఫై మోజు పెంచుకుంటారు. ఈ మధ్య రకుల్ సైతం బాలీవుడ్ ఛాన్స్ రాగానే అలాగే మారింది. ఏమాత్రం గుర్తు పట్టలేనంతగా సన్న పడింది. ఇప్పుడు ఇదే జాబితాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చేరింది. బాలీవుడ్ ఛాన్స్ రాగానే అమ్మడు తన కొవ్వు అంత తగ్గించే పని పెట్టుకుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ తో ఓ సినిమా చేసేందుకు ముంబై చెక్కేసింది.

మహానటి సినిమాలో బొద్దుగా కనిపించిన కీర్తి.. బాలీవుడ్ కు వెళ్ళగానే తన మేకోవర్ ను మార్చేసింది. టాలీవుడ్ జనాలు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. సన్నగా నాజూగ్గా మారి అందరికి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడి లేటెస్ట్ పిక్స్ చూస్తే నిజంగా ఈమె కీర్తినేనా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు లో నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 లో ఓ చిన్న రోల్ లో కనిపిస్తుంది.

Exit mobile version