Site icon TeluguMirchi.com

పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చిన కీర్తి..

నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని…ప్ర‌ముఖ బీజేపీ నాయకుడు కుమారుడిని కీర్తి పెళ్లి చేసుకుంటుందని..ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారని ఇలా అనే వార్తలు నిన్న ప్రచారం జరగడం తో అభిమానులు నిజమే అనుకోని ఆమెను అడగడం స్టార్ట్ చేశారు. అయితే ఈ వార్తలపై కీర్తి క్లారిటీ ఇచ్చింది.

. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, అలాంటి వదంతులు నమ్మవద్దని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మరో ఏడాది వరకు నీను చాలా బిజీ.. సినిమాలు చేయాడానికే సమయం లేద.. ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుందని తెలియజేసింది. ప్రస్తుతం తెలుగు లో నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో నటిస్తుంది. దాంతో పాటు ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్‌ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న ‘గుడ్‌ లక్‌ సఖి’ అనే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version