కీరవాణి పై సంచలన ఆరోపణలు

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో తీసిన సంగతి టిసిందే/ ఈ సినిమాకు పని చేసిన వారందరిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో జీఎస్టీకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కూడా విచారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, జీఎస్టీ స్క్రిప్ట్ తనదేనంటూ గతంలో ఆరోపణలు చేసిన రచయిత జైకుమార్ ఈ సందర్భంగా స్పందించారు. జీఎస్టీ చిత్రానికి ‘ఓం’ కారంను కీరవాణి స్వరపరిచారని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ క్రైస్తవ భక్తిగీతాలు, అయ్యప్పస్వామి భక్తి గీతాలు, నాగార్జునతో షిర్డి సాయిబాబా మూవీకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు. కీరవాణి అంత గొప్ప సంగీత దర్శకుడు మియా మాల్కోవా ప్రైవేట్ పార్ట్స్ పై ఓం కారాన్ని స్వరపరచడం బాధాకరమైన విషయం. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పేరు పడగానే ‘ఓం’ కారం వినపడుతుంది. అది ‘ఓం’ కారం కాదని వాళ్లు తమ వక్రబుద్ధి ప్రదర్శించవచ్చు! కానీ, ఆ సినిమాలో వినబడేది ‘ఓం’ కారం కాదని చెప్పడానికి వీలు లేదు” అని చెప్పుకొచ్చారు జైకుమార్