పదిహేను రేప్ సీన్సు, విపరీతమైన హింస తో ఒక తెలుగు చిత్రం రాబోతున్నది. బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో కీచక అనే చిత్రం ప్రీవ్యూ చూసిన కొందరు అసలు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అని ఆశ్చర్య పోయారట. నాగ పూర్ లో 300 మందిని రేప్ చేసిన ఒక రాక్షసుడి యదార్ధ గాధ ఆధారం గా నిర్మించబడిన ఈ చిత్రం లో పవర్ఫుల్ మెసేజ్ ఉండడం వల్లే సెన్సార్ ఆమోదం లభించి ఉండవచ్చని అంటున్నారు. సాంకేతిక విలువలు బాగున్నాయని, నటీ నటుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. గత సంవత్సరం ఆస్కార్ పోటీకి ఎంపికయిన మిణుగురులు చిత్రా రచయిత ఎన్ వీ బీ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. క్రైమ్ ఎలిమెంట్ తో సాగే ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ కావచ్చని కొందరి అంచనా.