‘కత్తి’ కి ‘ఖైదీ ‘ కి మార్పులు ఇవేనట..!

katti-khaidi

తమిళంలో విజయ్ – సమంత జంటగా మురుగదాస్ తెరకెక్కించిన మూవీ ‘కత్తి’. 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ , తమిళ ఇండస్ట్రీ రికార్డ్స్ ను చెరిపివేసింది..రైతుల భూముల నేపథ్యం లో సాగే కథ కు తమిళ ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు..ఇప్పుడు అదే చిత్రాన్ని చిరంజీవి ఖైదీ రీమేక్ లో నటించాడు. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో చాల మార్పులే చేసాడట.

Khidi-No-150-Pre-Release3

Also Read :అభిమానుల కోసం ఖైదీ ఏర్పాట్లు.

ప్రధానంగా కామెడీ ని బాగా జోడించాడట..ఒరిజనల్ కత్తి లో కామెడీ అనేది అసలు కనిపించదు..కానీ ఖైదీ లో మాత్రం చాల కామెడీ సీన్స్ ను తెరకెక్కించాడట వినాయక్. మెగా అభిమానులు చిరు కామెడీ ని బాగా ఇష్టపడతారు కాబట్టి చిరు – బ్రహ్మానందం తో ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ రాయించి చేయించారట. ఈ కామెడీ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. చిరంజీవి సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ రౌడీ అల్లుడు.. దొంగమొగుడు సినిమాలు రెంటినీ కలిపితే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంతా ‘ఖైదీ నెంబర్ 150’లో ఉంటుందట. ఇక ఈ మూవీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.