అసలు కట్టప్ప మోహన్ లలేనట.

దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పిన చిత్రం బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1500 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన నటి నటుల అందరికి మంచి పేరు వచ్చింది. ముఖ్యం గా కట్టప్ప పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇంత పేరు వచ్చిన కట్టప్ప రోల్ ముందు గా మలయాళ నటుడు మోహన్ లాల్ కు వచ్చిందట.

మొదట ఈ పాత్ర గురించి రాజమౌళి తననే అడిగాడని, కానీ వేరే సినిమాల బిజీ వల్ల అన్ని రోజుల కాల్షీట్స్ ఇవ్వలేనని చెప్పానని మోహన్ లాల్ తెలిపాడు. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ బాగా చేసాడని ప్రశంశలు కురిపిస్తూ , మంచి పాత్రను మిస్ చేసుకున్నాని చ్చేప్పుకొచ్చాడు. ఇక శివగామిగా ముందు శ్రీదేవిని అడిగిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ ప్రస్తుతం వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో రుపొంతున్న మహాభారతం సినిమాలో నటిస్తున్నాడు.