Site icon TeluguMirchi.com

కత్రినా తో ర్యాప్ స్టార్ పిట్ బుల్

katrina-kaif-with-pitbullక్రికెట్ అభిమానులను అలరించడానికి పొట్టి ఫార్మాట్ 20-20 ఐ పి యల్ (2013) కు రంగం సిద్దమౌతుంది. ప్రతి ఏటా గ్రాండ్ గా నిర్వహించే ఈ టోర్నీఆరంభ వేడుకలకు విపరీతమైన క్రేజ్ వుంటుంది. ఈ ఏడాది కూడా ప్రముఖ తారలతో టోర్నీ ని గ్రాండ్ గా ప్రారంభించాలని నిర్వాహకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ సారి ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ భారత్ లో అభిమానులను అలరించనున్నాడు. ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారంభోత్సవంలో పిట్ బుల్.. హాట్ గర్ల్ కత్రీనా కైఫ్ తో వేదికను పంచుకుంటాడు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 2న కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతుంది. ఇక ఏప్రిల్ 3 నుండి మ్యాచ్ లు జరుగుతాయి.

Exit mobile version