Site icon TeluguMirchi.com

కత్రినా తల్లి కాబోతుందా..?

ప్రస్తుతం బాలీవుడ్ మీడియా లో ఈ వార్తే చక్కర్లు కొడుతుంది. గత ఏడాది డిసెంబర్ లో యంగ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను కత్రినా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది కానీ కొత్త సినిమాలకు మాత్రం నో చెపుతోందట. దీనికి కారణం ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని అందుకే కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదని అంటున్నారు.

కత్రీనా తల్లికాబోతున్న విషయం ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ అవ్వలేదు. అలా అని మీడియ లో వస్తున్న వార్తలను కత్రీనా కానీ.. విక్కీ కౌశల్ కాని కొట్టి పారేయలేదు. కనుక కత్రీనా తల్లి కాబోతున్న వార్తలు నిజం అయి ఉంటాయని అంటున్నారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా సైతం తల్లి పోస్ట్ కొట్టేసింది. ఇప్పుడు ఇదే బాటలో కత్రినా కూడా నిలువబోతుందని అభిమానులు సైతం మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version