Site icon TeluguMirchi.com

నైట్ అంత కత్రినానే చూసారట.

Katrina-Kaifప్రతి ఏడాది నెటిజన్లు నెట్ లో ఎక్కువగా ఏ హీరోని, హీరోయిన్ సెర్చ్ చేశారో ఏడాది చివరన ప్రకటన చేస్తారు. ఈ ఏడాది నెటిజన్లు నెట్‌లో ఎక్కువగా ఎవరిని సెర్చ్ చేశారో తేలిపోయింది.బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫే ఈ ఏడాది ఎక్కువగా యూత్ సెర్చ్ చేసారు. ఈ అమ్మడు నటించిన ఒకే ఒక చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’. రణబీర్ కపూర్‌తో కలిసి కత్రినా రొమాన్స్, ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన ఫొటోస్ ని అందరూ అబ్బురంగా, ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు.

అంటే ఈ ఏడాది నెట్‌లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచి తన సత్తా చాటుకుందన్నమాట..రెండో ప్లేస్ దీపికా పదుకోనేకు దక్కింది, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘ఫైండింగ్ ఫ్యాన్నీ’ చిత్రాలు, ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ సినిమా దీపికకు హ్యాపీని మిగిల్చింది.

Exit mobile version