‘ కృష్ణార్జున యుద్ధం ‘ ఫై కత్తి రివ్యూ..

నాని ద్విపాత్రాభినయంలో నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జంటగా అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లు గా నటించారు. ఇక ఈ మూవీ ఫై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తన రివ్యూ ఇచ్చాడు.

‘‘కృష్ణార్జున యుద్ధం సినిమా చాలా మంచి స్టోరీ.. అలాగే చాలా మంచి రిజల్ట్ ఇచ్చే సినిమా. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన నటన అద్భుతంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని అందించిన ఫోటోగ్రఫీ, తమీజా సంగీతం ఈ చిత్రానికి అదనపు అట్రాక్షన్. కొన్ని అనవసర పాటలు, విసుగు పుట్టించే లెంగ్తీ సీన్స్ తప్ప ఈ సినిమా చాలా బాగుంది. ఇది చాలా డీసెంట్ మూవీ’’ అంటూ మహేష్ తన రివ్యూ ను తెలిపాడు.