Site icon TeluguMirchi.com

లైవ్ నుండి పరుగులు పెట్టిన కత్తి మహేష్..

గత కొన్ని నెలలుగా కత్తి మహేష్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఓ రెండు చానెల్స్ లలో కూర్చుని పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్నారంటూ చెప్పుకొని ఎక్కడి లేని పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఇక కత్తి మహేష్ ఆటలు సాగవని అందరికి తెల్సిందే. ఈయన ఎవరు చెపితే పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చాడో, ఈయన వెనుక ఉన్నది ఎవరో అందరికి తేలిపోయింది.

తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్ లో కూర్చున్న కత్తి మహేష్ , సదరు యాంకర్ , అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక లైవ్ లోనుండి పారిపోయాడు. ఆలా పారిపోకండి సమాధానం చెప్పండి మహేష్ గారు అన్నాసరే మీకు సమాధానం నేను ఎందుకు చెప్పాలంటూ వెళ్లి పోయాడు. గత కొంతకాలం గా ఆ రెండు చానెల్స్ మహేష్ ను ఇలాంటి ప్రశ్నలు వేయలేదు కాబట్టి మహేష్ ఆటలు సాగాయి కానీ అసలైన ఛానల్ విలువలు ఏంటో..ఇప్పుడు జనాలకు అర్ధం అవుతుండడం తో మహేష్ సమాదానాలు చెప్పలేక వెళ్ళిపోతున్నాడు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబదించిన కార్టిన్స్ కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

Exit mobile version