పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాపై ఉన్న నమ్మకంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాకు ఉగాది పండుగ కూడా కలిసి రావడంతో కలెక్షన్స్ వర్షం కురిసింది. పోటీగా మరే సినిమా లేక పోవడంతో ప్రతి ఒక్కరు కూడా కాటమరాయుడు చూడక తప్పలేదు. దాంతో ‘కాటమరాయుడు’ సినిమాకు భారీగా వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తాలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం జరిగింది. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు తప్పవని కొందరు అన్నారు. అయితే తాజాగా సినీ వర్గాల నుండి మరియు డిస్ట్రిబ్యూటర్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారం రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో పడ్డట్లుగా తెలుస్తోంది.
రెండవ వారం నుండి వచ్చేవన్ని కూడా లాభాలే అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంతో చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు నిర్మాత ఏకంగా తన ఖాతాలో 115 కోట్లను వేసుకున్న విషయం తెల్సిందే. సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవి చూశారు. కాని ఈసారి అంతా సేఫ్ అయినట్లే అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.