దాంతో కొందరు తెలుగు హీరో అని, మరికొందరు ఫలానా హీరో అని ఓ తెలుగు సీనియర్ హీరోను దృష్టిలో ఉంచుకుని కథనాలు రాశారు. దాంతో ఆ పుకారు కాస్త కస్తూరిని చేరింది. తెలుగు హీరోపై బురద చల్లిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ కస్తూరి.
తాజాగా మీడియాలో కస్తూరిని పిలిచింది ఫలానా తెలుగు సీనియర్ హీరో అని ప్రచారం చేస్తున్నారు. దాంతో సీరియస్ అయిన కస్తూరి ఎవడో ఇకటి పుట్టిస్తే మిగతా వారంతా కూడా దాన్నే కాపీ పేస్ట్ చేస్తారు. కాని ఇలాంటి అవాస్తవాలను కల్పించే ముందు ఓ సారి ఒరిజినల్ వీడియో అయినా చూడాలి కదా, ఇలా ఇష్టం వచ్చినట్టు ఫలానా అని పేరు తగిలిస్తారా..??
ఆ వీడియోలో నేను తెలుగు హీరో అనే పదాన్ని ఎక్కడయినా వాడానా..? అంటూ మీడియా దుమ్ము దులిపేసింది. తెలుగు హీరోను దృష్టిలో పెట్టుకునే కస్తూరి ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తాను తెలుగు హీరో గురించి చెప్పలేదు అని మాట మార్చి మీడియాపై బురద చల్లుతోంది అని మీడియా ప్రతినిధులు కస్తూరిపై ఫైర్ అవుతున్నారు.