ధనుష్ తల నరుకుతాం అంటూ బెదిరింపులు

తమిళ్ చిత్ర సీమలో ఓ పెద్ద సినిమా వస్తుందంటే దానివెంట వివాదాలు రావడం ఖాయం. ముఖ్యంగా టైటిల్ , పలు సన్నివేశాల విషయాలలో పలు వర్గాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వారు అభ్యంతరం చేస్తుంటారు. తాజాగా ధనుష్ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ధనుష్ కర్ణన్ చిత్రంలో నటిస్తున్నాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ లో కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కహా ఈ చిత్రంపై ఒక వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది అంటూ వారంతా ఆందోళన చేస్తున్నారు.

1999లో జరిగిన కొడియాంగుళం మణిమచ్చి జాతి ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని.. పులిప్పడై సామాజిక వర్గంను ఈ చిత్రం లో తప్పుగా చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివాజీ గణేశన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పులిప్పడై సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు తమ సామాజిక వర్గం గురించి ఎలాంటి తప్పుడు సీన్స్ ఉన్నా కూడా తల నరికేస్తామంటూ వీడియో ద్వారా హెచ్చరించారు. మరి ఈ వివాదం ఎలాంటి వాటికీ దారితీస్తుందో అని అంత భయపడుతున్నారు.