Site icon TeluguMirchi.com

ఇక ‘ముద్దులు’ వద్దు

saifబాలీవుడ్ లో చాలాకాలం హాట్ హాట్ ప్రేమ వ్యవహారం నడిపించి, పెళ్లి తో ఒక్కటైనా జంట సైఫ్-కరీనా. ఈ జంట రోమాన్స్ .. అఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ లో యమా వేడిగా సాగేది. పెళ్ళైన తరువాత కూడా కొన్ని చిత్రాల్లో సైఫ్- కరీనా ఆన్ స్క్రీన్ లిప్ లాక్ లు, మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించారు. అయితే బెబో కరీనాకు వున్నట్టుండి ఏమైందో తెలిదుగాని.. ఇక తెర పై ముద్దులకు ‘నో ‘చెబుతోంది. తానే కాదు సైఫ్ కు కూడా కండిషన్లు పెట్టింది. ఇక పై ఆన్ స్క్రీన్ లిఫ్ లాక్ సీన్లలో నటించడానికి వీళ్ళేదని తేల్చిచెప్పేసిందట కరీనా. సైఫ్ కూడా ఈ కండిషన్ కు ఓకే చెప్పేశాడు. సైఫ్-కరీనా ల రొమాంటిక్ సన్నివేశాలను ఎంజాయ్ చేసే బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ వార్తా కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి.

Exit mobile version