హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చే చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన కాంతార సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని రిషబ్ శెట్టి అనౌన్స్ చేసినప్పటినుండి, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా కాంతార చాప్టర్ 1 నుండి అదిరిపోయే అప్డేట్ ను అందించారు మేకర్స్.
‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. వీటిని చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అంతేకాదు టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ అందరూ ఆశ్చర్యపడేలా వుంది. ఇక ఈ టీజర్లో వినిపించిన సంగీతం ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. కాగా ఏడు భాషల్లో కాంతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది రానున్న కాంతార చాప్టర్ 1 మీద ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఏడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ కలిసి భారీ ఎత్తున రూపొందిస్తున్నారు.