దర్శకుడు బిక్స్ తను చెప్పాలనుకున్న ప్రేమకథను ఒక చక్కని కుటుంబ కథతో చెప్పినట్లుగా అనిపిస్తుంది. పృథ్వీ కామెడీ సినిమాకు మరింతగా ప్లస్ అవుతుందనిపిస్తుంది. ఇక సంగీత దర్శకుడు సాకేత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే ఆకట్టుకున్నాడు. పాటలు కూడా తప్పకుండా బాగుంటాయని అనిపిస్తుంది. సినిమాకు ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉండాలి.
సినిమాలోని సీన్స్‌ను హైలైట్ చేసే విధంగా సాకేత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత సాకేత్‌కు మంచి ఆఫర్స్ వస్తాయని ఇతర చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘కన్నుల్లో నీ రూపమే’ చిత్రానికి సాకేత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుందని, అలాగే పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.