ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చెంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి AR రెహమాన్ సంగీతం అందించనున్నారు.
Also Read : మరియమ్మకు ఆటో గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్ కేఎన్
ఇకపోతే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈరోజు శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘కరునాడ చక్రవర్తి’ కి స్వాగతం అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. అలాగే ఈ సినిమాతో శివ రాజ్ కుమార్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది.
Also read : అందుకే ఈ సినిమాకి ప్రభాస్ మూవీ టైటిల్ పెట్టాం..?
Welcoming ‘Karunada Chakravarthy’ @NimmaShivanna on board for a pivotal role that resonates with his stature
Team #RC16 wishes #Shivanna a very Happy Birthday
#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/gPmlgJ70xX— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2024