బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం లండన్ నుండి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీనితో డాక్టర్స్ ఆమెకు లక్నో నందు గల సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యం అందిస్తున్నారు.
అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత తొలి నాలుగు టెస్ట్‌ల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమయింది. అయితే ఐదు, ఆరోసారి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్ చేశారు. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్‌కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.