Site icon TeluguMirchi.com

సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ నుండి అనుకోని మద్దతు

అర్జున్ రెడ్డి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన కబీర్ సింగ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవైపు సినిమా సూపర్ హిట్ అయితే బాలీవుడ్ విమర్శకులు, సినీ ప్రముఖులు మాత్రం ఈ సినిమా మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాదికి చెందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అక్కడ నిలదొక్కుకోవడానికి ఇష్టపడకే ఈ విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అందుకే ఈ విమర్శల మీద సందీప్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రేమికులు ఒకరిని ఒకరు చెంపపై కొట్టుకోకపోతే, అడ్వాంటేజ్ తీసుకోకపోతే వారి మధ్య ప్రేమ ఎక్కడ ఉన్నట్టని ప్రశ్నించారు. దీంతో సందీప్‌పై సమంత, చిన్మయి, అనసూయ లాంటి టాలీవుడ్ ఫెమినిస్ట్ సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేశారు.

కానీ సందీప్ కి అనూహ్య మద్దతు తెపిపింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అక్క రంగోలి రనౌత్. అసలు ప్రియురాలిని కొట్టడం, ఆమెతో మోటుగా సరసమాడటం వంటివి అప్పుడెప్పుడో రాజ్ కపూర్ సినిమాలోనే జరిగాయని, రాజ్ కపూర్‌ను దిగ్గజంగా పరిగణించే మీరు ఒక దక్షిణాది దర్శకుడి పట్ల ఇలా ప్రవర్తించడం మానండి’ అంటూ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. రాజ్ కపూర్ అత్యంత శృంగారభరితమైన, మొరటైన సన్నివేశం ఇది. అసలు సిసలైన బాలీవుడ్ రూపం ఇది. అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు.

Exit mobile version