Site icon TeluguMirchi.com

ఇది విన్నారా… ప్రభాస్‌తో ఆమెకు మాటలే లేవట

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా జాతీయ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. వివిధ భాషల్లో ప్రభాస్‌కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ‘బాహుబలి 2’ చిత్రాన్ని వీక్షించిన సినీ ప్రముఖులంతా కూడా రాజమౌళి, ప్రభాస్‌, యూనిట్‌ మొత్తంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకులు సైతం ‘బాహుబలి 2’ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. ఏది చెప్పిన ముకుసూటిగా చెప్పే కంగనా ‘బాహుబలి 2’ గురించి ఏం చెబుతుందా అని ఆసక్తిగా మారింది.

ఎవరు బాదపడినా కూడా తన మనస్సులో ఉన్నది టఫీమని చెప్పే కంగనా ‘బాహుబలి 2’ చిత్రం చాలా బాగుంది అని కితాబిచ్చింది. గతంలో ప్రభాస్‌తో ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్ర సమయంలో చిన్నపాటి గొడవ జరిగిందని, ఇక అప్పటి నుండి ప్రభాస్‌తో మాటలు లేవని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రభాస్‌తో తాను మాట్లాడకున్నా కూడా ‘బాహుబలి 2’ చూశానని, ఈ చిత్రంలో బాహుబలి పాత్రకు ప్రభాస్‌ బాగా కుదిరాడు, ఆయన నటన మంత్రముగ్దులని చేసింది, నేను గతంలో ఈ హీరోతో కలిసి పని చేసిన అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అని కంగనా చెప్పుకొచ్చింది.

Exit mobile version