Site icon TeluguMirchi.com

కమల్ వెనకడుగు వేశాడా?

kamalఎట్టకేలకు కమల్ విశ్వరూపం డీటీహెచ్ వివాదం సద్దుమనిగింది. కమల్ ఏ ముహూర్తంలో డీటీహెచ్ ప్లాన్ వేశాడో అప్పటినుండి కంటి పై కునుకు లేకుండా చేసింది ఈ డీటీహెచ్ గొడవ. డీటీహెచ్ ద్వారా ఓ కొత్త వరవడికి శ్రీకారం చుట్టి పైరసీ పనిపడదామనుకున్న కమల్ చివరకు వెనక్కి తగ్గాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు వెర్షన్లు ధియేటర్లలో ఈ నెల 25 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 2 రాత్రి ఈ చిత్రాన్ని డీటీహెచ్ ద్వారా నేరుగా టీవీలో ప్రసారం చేస్తున్నట్టు కమలహాసన్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అంటే ధియేటర్లలో కంటే డీటీహెచ్ లో ‘విశ్వరూపం’ ఓ వారం తర్వాత ప్రసారం అవ్వనుంది. రెండూ ఒకేసారి చేస్తానంటూ పట్టుపట్టిన కమల్, చివరికి ధియేటర్ యజమానులతో రాజీ పడక తప్పలేదు. ఈ మేరకు డీటీహెచ్ ప్రిమియర్ రేటును కుడాతగ్గిస్తున్నట్లు తెలిపాడు.

Exit mobile version