Site icon TeluguMirchi.com

రజనీని కలసిన కమల్.. నో పాలిటిక్స్


తమిళనాడులో త్వరలో తన పర్యటన ప్రాంభించనున్న కమలహాసన్ ఈరోజు రజనీకాంత్ ని ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన కమల్ ని ఆప్యాయంగా రజనీకాంత్ ఆహ్వానించారు. . భేటీ అనంతరం మీడియాతో కమల్ మాట్లాడుతూ, రజనీకాంత్ ని కలిసింది రాజకీయాల నేపథ్యంలో కాదని, తమిళనాడులో తన రాజకీయ పర్యటన ప్రారంభించనున్న విషయాన్ని ఆయనకు చెప్పేందుకు వచ్చినట్టు చెప్పారు.

తన పర్యటనకు ముందు అందరినీ ఓసారి కలవాలని అనుకున్నానని, ఈ నేపథ్యంలోనే రజనీని కలిసినట్టు చెప్పారు. ఈ నెల 21న తన రాజకీయపార్టీని ప్రకటిస్తున్నానని, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదని అన్నారు. ఇప్పటికే రజనీకాంత్ పార్టీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version