యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ మరియు శంకర్‌ల కాంబినేషన్ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. తమిళంలో తెరకెక్కి తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా రికార్డుల వర్షం కురిపించింది. అప్పటి నుండి కూడా సినిమాకు సీక్వెల్ అంటూ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు గత ఏడాది అంతా ఓకే అయ్యి కమల్ మరియు శంకర్‌లు భారతీయుడు 2 ను మొదలు పెట్టారు. కాని సినిమా ప్రారంభం అయిన తర్వాత ఏవో అడ్డంకులు వచ్చి సినిమా ఆగుతూ వచ్చింది. తాజాగా సినిమా మళ్లీ పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు.
ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవడం జరిగింది. అయితే కాజల్ ఆలస్యం కారణంగా తాను ఈ చిత్రంలో నటించలేనని, డేట్లు కుదరడం లేదు అంటూ తేల్చి పారేసింది. భారతీయుడు వంటి భారీ చిత్రం నుండి కాజల్ తప్పుకోవడంతో ఆ ఛాన్స్‌ను తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌కు దక్కిందని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌తో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు వచ్చే రెండు నెలల తర్వాత ఖాళీ ఉందట. అప్పుడు సినిమాను మొదలు పెట్టబోతున్నారు. రకుల్ ఈ చిత్రం నిజంగానే దక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే.