రాజమండ్రిలో కమల్ బస చేసిన చోటు నుండి జైలు వరకు భారీ ఎత్తున అభిమానులు పోగయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేయడంతో రాజమండ్రి మొత్తం కలకలలాడిపోయింది. మొదటి సారి కమల్ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చాడంటూ అభిమానులు ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. ఇక సెంట్రల్ జైలుకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్నతాధికారులు మరియు నాయకులు కమల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆహ్వానంకు సంతోషం అన్నాడు. 20 రోజుల పాటు రాజమండ్రిలోనే కమల్ ఉండి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.