రాజమండ్రి జైల్లో కమల్‌కు ఘన స్వాగతం

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి సమయంలో రాజమండ్రికి కమల్‌ హాసన్‌ చేరుకున్నాడు. అక్కడ రాత్రి బస చేసిన తర్వాత ఉదయం పూట జైలుకు కమల్‌ వెళ్లాడు.

రాజమండ్రిలో కమల్‌ బస చేసిన చోటు నుండి జైలు వరకు భారీ ఎత్తున అభిమానులు పోగయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేయడంతో రాజమండ్రి మొత్తం కలకలలాడిపోయింది. మొదటి సారి కమల్‌ షూటింగ్‌ కోసం రాజమండ్రి వచ్చాడంటూ అభిమానులు ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. ఇక సెంట్రల్‌ జైలుకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్నతాధికారులు మరియు నాయకులు కమల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆహ్వానంకు సంతోషం అన్నాడు. 20 రోజుల పాటు రాజమండ్రిలోనే కమల్‌ ఉండి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.