Site icon TeluguMirchi.com

రజనీ పై కమల్ కాషాయ రంగు కామెంట్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌వి కాషాయ రాజకీయాలు కాకూడదని కమల్‌ హాసన్‌ వ్యాఖనించడం ఆసక్తికరంగా వుంది. కమల్‌ అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రజనీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. ‘రజనీ రాజకీయాల్లో కాషాయ రంగు కన్పిస్తోంది. ఆ రంగు వదిలించుకోకపోతే నేను రజనీతో కలిసి పనిచేయడం అనేది జరగదు. మేమిద్దరం మంచి స్నేహితులమే కానీ రాజకీయాలు వేరు” అని చెప్పుకొచ్చారు.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సినీరంగంలో మంచి స్నేహితులు.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన మొదట్లో కలిసి ప్రయాణం చేశారు. కలిసి సినిమాల్లో నటించారు. సూపర్‌స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోనూ వీరిద్దరి మధ్య ఆ స్నేహబంధం కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version