కమల్ పార్టీపై శృతి కామెంట్

కమల్ హాసన్ కొత్త పార్టీ పెట్టారు. తమిళనాడులో పక్కా తమిళ పేరుతోనే ఆయన పార్టీ ‘మక్కళ్ నీతి మయ్యమ్’ అంటూ తన పార్టీని స్థాపించారు తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఆరు చేతులతో పార్టీ జెండాను కమల్‌ ఆవిష్కరించారు.

ఆయన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ రాణించాలని వారంతా ఆకాంక్షించారు. ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న ఆయన కుమార్తె శ్రుతి హాసన్ కూడా తమ తండ్రికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.

“మార్పు, రాజకీయ సంస్కరణ కోసం తొలి అడుగు వేసిన నా ప్రియమైన తండ్రికి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. గాంధీ స్ఫూర్తిగా మీరు ముందుకు సాగిపోవాలి. సత్యం, న్యాయ సాధన దిశగా మీ సంకల్పం, పట్టుదల కొనసాగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను” అని ట్వీట్ చేసింది శ్రుతి.