Site icon TeluguMirchi.com

మాటలా రచయితగా మారిన కమల్

Kamal-Haasan-Writer
కమల్‌హాసన్ విలక్షణ నటుడిగా ఇంతో పేరు తెచ్చుకున్న నటుడు…ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ చెయ్యలేరు అన్నది నిజం. దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా… అన్ని రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్ హసన్. ప్రస్తుతం కమల్ ‘ఉత్తమవిలన్’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ హసన్ ఈ చిత్రం లో మాటలు కూడా రాస్తున్నాడట.

మొదటగా ఈ చిత్రానికి మోహన్‌ మాటలు రాస్తున్నాడు అని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో ఈ చిత్రానికి సంభాషణలు రాసే భాద్యత కూడా కమలే తీసుకున్నాడట. ఈ చిత్రం లో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version