Site icon TeluguMirchi.com

Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి పెళ్లి పాట వచ్చేసింది..


స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Rao Ramesh : రావు రమేష్ హీరోగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’.. ప్రేక్షకులే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌

‘కల్యాణి వచ్చా వచ్చా.. పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..’ అంటూ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా.. మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version