మొత్తం పోయిన‌ట్టేనా..?

kalyan-ram-s-om-audio-on-may-25thఓం సినిమాపై భారీ ఆశ‌లు పెంచుకొన్నాడు క‌ల్యాణ్‌రామ్‌. త్రీడీ సినిమా కావ‌డం, దానితో పాటు ర‌జ‌నీకాంత్ ప్రసంశ‌లు… ఈ సినిమాకి హైప్ తీసుకొచ్చాయి. ఇది వ‌ర‌కు ఎప్పుడూ లేనంత‌గా క‌ల్యాణ్‌రామ్ సినిమాపై ఫోక‌స్ పెట్టారు సినీ జనాలు. అయితే ఈ సినిమా విడుద‌లైన రోజే తుస్సుమంది. హంగు, ఆర్భాటం తప్ప ఈ సినిమాలొ ఏమీ లేద‌ని విమ‌ర్శకులు తేల్చేశారు. త్రీడీ ఎఫెక్టులు కూడా ఈ సినిమాకి కాపాడ‌లేక‌పోయాయి. దాంతో క‌ల్యాణ్‌రామ్ ఆశ‌ల‌న్నీ ఆవిరైపోయాయి. రూ.18 కోట్ల సినిమా – మ‌టాష్‌!! శుక్రవారం తొలి ఆట‌కు మంచి వ‌సూళ్లే వ‌చ్చినా.. క్రమంగా అవి త‌గ్గిపోయాయి. దాంతో ఈ సినిమాకి పెట్టిందంతా పోయిన‌ట్టే అని దిగాలు ప‌డిపోతున్నాడు క‌ల్యాణ్‌రామ్‌. ఒక సినిమాపై ఈ స్థాయిలో ఖ‌ర్చుపెట్టేక‌న్నా.. వాటితో నాలుగు మంచి సినిమాలు చేసుకొంటే ఒక్కటైనా హిట్టవుదును క‌దా.. అని ఇప్పుడు లెక్కలేసుకొంటున్నాడ‌ట‌. పాపం ఏం చేస్తాం..? ఇట్స్ టూ లేట్‌.