తమ్ముడి విషయంలో తగ్గేదే లేదంటున్న అన్నయ్య

kalyan ramనందమూరి కళ్యాణ్‌రామ్‌ ఇటు హీరోగా పలు చిత్రాలను చేతిలో పెట్టుకునే అటు నిర్మాణ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు. హీరోగా చేస్తున్న చిత్రాలు పలు ఫ్లాపు అయినా కూడా నిర్మాణ రంగంలో ఇంతవరకు మంచి లాభాలనే గడిరచాడు. కానీ తాజాగా రెండు చిత్రాలతో కళ్యాణ్‌ రామ్‌ దాదాపుగా 20కోట్ల నష్టాలను చవి చూశాడట. ‘కిక్‌ 2’, ‘ఇజం’ చిత్రాలు భాక్సాఫీసు వద్ద ఫ్లాపు అయ్యాయి. అయినా కూడా తన తదుపరి చిత్రానికి మాత్రం ఏ మాత్రం ఆలోచించడం లేదు. తమ్ముడి మీద ఉన్న నమ్మకంతో, దర్శకుడు బాబీ చెప్పిన కథను నమ్మి ఎంత మొత్తంలో అయినా ఖర్చు చేయడానికి కళ్యాణ్‌ రామ్‌ ఉత్సాహాన్ని కనబర్చుతున్నాడు.

ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తుండగా కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ముందుగా 55కోట్లను ప్లాన్‌ చేసుకున్నారట. అయితే సినిమా పూర్తి అయ్యే సరికి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కథలో నాణ్యత ఉండడంతో క్యాస్టింగ్‌ విషయంలో కూడా రాజీ పడడం లేదట. అందుకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై పూర్తి స్థాయి నమ్మకం ఉండబట్టే ఇంత ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు. మొత్తానికి తమ్ముడి సినిమా విషయంలో ఏ మాత్రం తగ్గకుండా కళ్యాణ్‌ రామ్‌ భారీగా నిర్మిస్తున్నాడు.