ఈ గ్యాప్‌లో పలు కథలు విన్న కళ్యాణ్ దేవ్ తాజాగా ఒక లవ్ స్టోరీకి ఓకే చెప్పాడు. యంగ్ డైరెక్టర్ తాజాగా కళ్యాణ్ ను మెప్పించాడట. ఆ కథను చిరంజీవి మరియు అల్లు అరవింద్ వద్దకు కూడా ఆ యంగ్ డైరెక్టర్ తీసుకు వెళ్లబోతున్నారు. వారిద్దరు ఓకే చెప్తే సినిమా ఇదే ఏడాది ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నటన పరంగా ఎక్కువ స్కోప్ లేకుండా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కళ్యాణ్ దేవ్ రెండవ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంది.