Site icon TeluguMirchi.com

కల్కి నుండి ఎవ‌రో ఎవ‌రో ..

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. గరుడవేగా తర్వాత రాజశేఖర్ నుండి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.జూన్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు.

ఇప్పటికే ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఎవ‌రో ఎవ‌రో అనే మెలోడీ సాంగ్ విడుద‌ల చేశారు. హేమ‌చంద్ర‌, స్వాతిమోహ‌న్ ఆల‌పించిన ఈ పాట‌కి కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించారు. శ‌ర్వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించారు.

ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత.

Exit mobile version