మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానులు మెగా బర్త్ డేని జరుపుకుంటుంటే, మరోపక్క మూవీ లవర్స్, అభిమానులు, ఫాలోవర్లు, సినీ ప్రముఖులు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా కల్కి 2898AD చిత్రబృందం సైతం మెగాస్టార్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ ను తెలిపింది.
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ లో ఆయన బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో వెల్డింగ్ చేసే ఫైర్ పైప్ పట్టుకున్న లుక్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అదే సీన్ ను కల్కి 2898 ఏడి మూవీ లో రీక్రియేట్ చేశాడు ప్రభాస్. బ్యాక్ గ్రౌండ్ లో గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ వస్తూ ప్రభాస్ వెల్డింగ్ ఫైర్ పైప్ పట్టుకున్న చిన్న వీడియో బిట్ ని రిలీజ్ చేసారు. చిరు లీక్స్ స్ఫూర్తితో అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో వుంది.
Straight from the hearts and the editing room of #Kalki2898AD
Here’s wishing our Megastar @KChiruTweets garu an extraordinary birthday!
Inspired by #ChiruLeaks
pic.twitter.com/uFrJp8Rx9T
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 22, 2023