Site icon TeluguMirchi.com

Kalki 2898 AD : రూ.100 కే ‘కల్కి’ టికెట్..


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘కల్కి 2898AD’. జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది. చాలా ప్రాంతాలలో నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబట్టింది. ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. దీంతో పార్ట్ 2 పై క్యూరియాసిటీ పెరిగింది.

Also Read : లెక్కలు మాస్టారుగా మారిన ప్రియదర్శి.. పిల్లలు జాగ్రత్త మరి !

ఇకపోతే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 100కే తమ సినిమాని చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు ఈ ఆఫర్‌ వర్తించనున్నట్లు తెలిపింది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..

Exit mobile version